Pages

Sunday, October 1, 2017




అభినవ భగత్ సింగ్ 
 పవన్ కళ్యాణ్ 


కొణిదెల  కళ్యాణ్ బాబు ...... 

అతను ఒక తత్వవేత్త  
అతను ఒక విప్లవకారుడు ..
అతను  ఒక మేధావి ..
ఒక రైతు ...



నేను వివేకానందన్ని  చూడలేదు ...

నేను భగత్ సింగ్ ని చూడలేదు ...

కానీ ఇతని మాటలు విన్న తరువాత ..వాళ్ళు ఎలా ఉంటారో అర్థం అయింది ...




పవర్ తో సాదించాలి అని పవర్ స్టార్ ఎపుడు అనుకోలేదు ... 

ప్రశ్నించడం తో సాదిస్తాను ... అన్నాడు చేసాడు ..

  • ఉద్దానం సమస్య ..
  • ఆక్వా ఫుడ్  సమస్య ..
  • జీవో 64ను రద్దు...


వ్యవసాయ శాఖ పోస్టింగులకు సంబంధించిన జీవో 64ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిఃసిందే.. వారు ఇటీవల పవన్ ను కలవడం... వారి తరఫున పవన్ ప్రభుత్వం వద్ద తన గళం వినిపించడం కూడా జరిగింది నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా  జీవోను రద్దు చేసింది




ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ...
ని పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు ... అనే సూక్తి ని నమ్మినవాడు పవన్ కళ్యాణ్ ..

మనస్పూర్తి నవ్వుతాడు ...  కల్మషం లేని నవ్వు అంటారు చూడు ఆలా ...
అయన స్థాయి వేరు .. అయన స్థానం వేరు ..





అతను ఎందరికో స్ఫూర్తి

ఎస్ అతను పెద్దగా చదువుకోలేదు ... కానీ ఎంతో మంది చదువుకున్న వాళ్లకు ఆదర్శనంగా నిలిచాడు ..

చిన్న తనం లో ఆరు బయట పడుకోవాలంటే భయం ..
పది మంది మధ్య ఉండాలంటే భయం .. 


అలంటి వ్యక్తి ఇప్పుడు ...
ఎంతో మంది గుండెల్లో చైతన్యాన్ని నింపుతున్నాడు ... ఎంతో మంది కి చైతన్య వంతులుని చేస్తున్నాడు...

రెచ్చకొట్టటానికి ...
చైతన్య వంతుల్ని  ని చేయటానికి చాల తేడా ఉంది ..అది గమనించాలి ... మనం ఇక్కడ.

నేను ఇప్పటి దాక ఇంత పవర్ఫుల్ ఎనర్జిటిక్ లీడర్ ని చూడలేదు .. తన మాట లో ఎంత పవర్ ఉందొ మీకు క్రితం ఎలెక్షన్స్ లో తెలిసే ఉంటది



కేవలం తనని విమర్శించటం వల్లే కొంతమంది పాపులర్ అవుతున్నారు అంటే .. అర్థం చేసుకోండి అతని ఫాలోయింగ్ ...

తాను ఒకసారి మాట్లాడితే చాలు ...
తనని ఒకసారి కలిస్తే చాలు ....తపించే హృదయాలు ఎన్నో 

ఎస్ మై హీరో అలాగే ఉంటాడు ... 

"Pawan Kalyan's talk touched my heart. My soul said that if there are youth like Pawan Kalyan, the Telugu spirit can never die. Telangana and Seemandhra can both prosper under someone like him"
—Prime Minister Narendra Modi about Pawan Kalyan

తాను నాకు అంతలా ఎందుకు ఇష్టం అంటే ...

  • ఎంత ఎత్తుకు ఎదిగిన ఒడిడిగే ఉంటాడు ...
  • తనకు ఉన్న దానికి సంవత్సరానికి 2-3 సినిమాలు చేయోచ్చు ... యాడ్ ఫిలిమ్స్ చేయొచ్చు ... నేను వాడని దానికి నేను ఆలా ప్రమోట్ చేయాలి అని చేయలేదు ...
  • తన కున్న ఫాలోయింగ్ తో తాను ఏదైనా చేయూచు ఏదైనా మాట్లాడొచ్చు ...కాని ఎపుడు హేట్  స్పీచెస్ ఇవ్వలేదు .. రెచ్చకొట్టే ఎన్నడూ మాట్లాడలేదు .. 
  • ప్రత్యేక హోదా ని అడ్డం పెట్టుకొని .. ధర్నాలు..  శవ రాజకీయాలు చేయలేదు
  • తాను కాపు .. కుల రాజకీయాలు చేయాలిఅనుకుంటే .... నిమిషం పాటు  పని ... కాపు రిజర్వేషన్స్ మద్దత్తు ఇచ్చి రాత్రి కి రాత్రి కి పొలిటిషన్ అయ్యాయేవాడు కానీ ఆలా చేయలేదు ...



ఆపద్బాంధవుడు :

ఒక పావలా శ్యామల .. ఒక శ్రీజ .. సత్యానంద్  ఇలాంటి వారు ఎందరో 





 ఇంత ఫాలోయింగ్ ఉండి .. ఇంట పెద్ద ఫామిలీ ఉండి .. ప్రతి అనాకారి వెదవ తో .. పదవి కోసం పది పార్టీలు మరీనా వారితో ... కోట్లకొద్దీ అవినీతి చేసి .. కుల మాత .. శవ రాజకీయాలు చేసే వేదవాల్తో మాటలు పడాల్సిన అవసరం ఏంటి ?

తనకు ఎందుకులే ఈ పనికిమాలిన నీతిమాలిన రాజకీయాలు అనుకూంలేదు ..ఎదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు .. ఐ సపోర్ట్ మై హీరో .



అల్ ది best to పవన్ కళ్యాణ్ గారు .. ఫర్ 2019 ఎలక్షన్స్ 



 పైన చెప్పినవి అన్ని ఒక ఫ్యాన్ గ నా ఆలోచనలు నా భావాలూ మాత్రమే ..  

మీ కళాశంకర్

Thursday, September 7, 2017




ఇక సెలవు


ప్రపంచం లో ఏది ఆగిన ఆగనివి రెండు.. సూర్యోదయo .. సూర్యాస్తమయం అలారంతో పనిలేకుండా సూర్యుడు వచ్చేస్తాడు  ..

ఊరి మధ్యలో ఉన్న రామాలయం గుడి లో సుప్రబ్రతం వినిపిస్తుంది ..  




గుడి లో రాముడి అర్చన కి పద్మనాధమ్ గారు పూజ కి పూల హారాన్ని సిద్ధం చేస్తున్నారు... ఆ రోజు ఆ ఊరి ప్రసిడెంట్  గారి కూతురి మొదటి  పుట్టినరోజు ...  ఊరంతా పండగల తన అమ్మాయి పుట్టినరోజుని చేస్తున్నాడు .. ఫామిలీ తో పాటు గుడి కి వచ్చాడు పూజ చేయించడానికి .. పద్మనాధమ్ గారు గుడి కి వచ్చిన అందరికి గోత్ర నామాలు చదివి పూజ చేసి ప్రసాదాలు పంచారు ...


 ఆ రోజుకి పూజ ముగించి గుడి కి తాళాలు వేసి ఇంటికి బయలుదేరారు  పద్మనాధమ్ గారు.. .. పద్మనాధమ్ గారికి మనసంతా  ప్రసిడెంట్ గారి అమ్మాయి బోసి నవ్వు లే  చిట్టి చిట్టి పదాలతో తాను వేసి బుల్లి అడుగులు . తన మదిలో మెదులుతున్నాయి ...పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అయినా పద్మనాధమ్ దంపతులకి సంతానం లేరు ...ఎందరికో వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని పూజలు చేసే పద్మనాభం గారికి సంతానం లేక పోవటం జీవితం లో  ఒక వెలితి ... ఎప్పటికైనా తనని ఆ రాముడు కరుణిస్తాడని తన ఒక వంశోద్ధారకుడుని ఇస్తాడని చిన్ని ఆశ ..తన్నాని నమ్ముకున్న రాముడు తనకి అన్యాయం చేయడని.

ఇంతలో పద్మనాభం గారి ఇల్లు వచ్చేసింది ... 



మహాలక్ష్మి 
పద్మనాభం గారి సతీమణి ..  మహాలక్ష్మి గారు పద్మనాభం గారికి మేనత్త కూతురు ..
మహా .. ఏంచేస్తునవ్ అని అడిగారు పద్మనాభం గారు ... ఎదో పరధ్యానం లో ఉన్న మహాలక్ష్మి గారు పలకలేదు ... పద్మనాభం గారు మరో సారి మహాలక్ష్మి  అని పూర్తి పేరుతో పిలిచారు ..

వెంటనే తేరుకున్న ..మహాలక్ష్మి గారు హ ఏమి లేదు అండీ ..అంటూ వంటగదిలోకి  గ్లాసు తో మంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది .. మనిషి అయితే ఇక్కడే ఉంది కానీ ..మనసు ఇక్కడ లేదు మహాలక్ష్మి గారిది.. అది గమనించిన ..పద్మనాభం గారు.. మహా ఏమైంది ఆలా ఉన్నావ్ .. ఏమి లేదు అండి ...

 హ మరిచిపోయాను  ప్రసిడెంట్  గారి కూతురి పుట్టిన రోజు అంట ఇవాళ .. రాత్రి భోజనానికి రమ్మని పిలిచారు ..

దానికి పద్మనాభం గారు ..అవును ఉదయాన్నే గుడి కి వచ్చారు అర్చన చేయించడానికి నాకు చెప్పారు ..వెళ్దాం లే ..నేను రాను అండి అన్నది మహాలక్ష్మి గారు ..

ఏం ? 
ఈమధ్య ఏదైనా ఫుక్షన్ కి వెళ్తే అందరు మనకు పిల్లలు లేరు అనేదాని గురించే అడుగుతున్నారండి...
కొందరైతే ..పిల్లలు లేని నేను చిన్న పిల్లలని దీవించడానికి కూడా వీలులేదు అని అంటున్నారు ..
.. ఎన్ని పూజలు చేసిన ఆ రాముడు ఎందుకు కరుణించటంలేదో అర్థం కావటం లేదు ...

పిల్లలు లేకుండా ఇలా   గొడ్రాలు  లా అయిపోతానేమో అని భయం గ ఉంది అండి




ఆలా ఏమి జరగదు లే మహా ...


రాత్రి .. ప్రసిడెంట్ గారి ఇంటికి భోజనానికి వెళ్లారు పద్మనాభం గారు ..భార్యా డాగర ఏమి తేలినట్టు గ ఉన్న పద్మనాభం  గారికి కూడా మనసులో పిల్లలు లేరు అనె
బాధ తన మనసుని మెలి పెడుతుంది .. కానీ ఈశ్వరరుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అనేది అయన నమ్మకం.

గడిచిన 10  సంవత్సరాలలో ఎన్నో అవమానాలు
ఎన్నో బాధలు..
అన్నిటిని దిగమింగుకొని తాను నమ్మిన రాముడు తనకి మోసం చెయ్యడు అనే ఒక్క ఆశ తో జీవిస్తున్నారు ..

1 సంవత్సరం తరువాత ... ఆ దంపతులని రాముడు కరుణించాడు .. ఆ మహాతల్లి కడుపు పండింది ..

ఆ దంపతులకి మగ బిడ్డ పుట్టాడు ..వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ..

ఆ రాముడికి కానుకగా  భావించి జయరాం అని పేరు పెట్టారు ..

ఆ పిల్ల వాడు బహుముఖ ప్రజ్ఞాశాలి.. చూస్తుండగానే కాలం గడిచిపోయింది ... జయరాం పెరిగి పెద్ద వాడు అయ్యాడు ... దంపతుల ఆశలన్నీ అతని పైనే .. జయరాం కి చదువు బాగా రావటం తో అతనిని డాక్టర్ చేయాలనీ పద్మనాభం గారు ఆశించారు .. అందుకు తగ్గ సమయం రాణే వచ్చింది ...


జయరాం ఆ పల్లెటూరి ని తన తల్లిదండ్రులని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది ..
ఆ తల్లి మనసు పంపించటానికి అంగీకరించ పోయిన ఆ పల్లెటూరి లో అంత కన్నా చదువు లేక పోవటం .. భర్త మనసెరిగినది కనుక తన కొడుకు డాక్టర్ అయితే అది తమకే పేరు తెస్తుంది కానక... ఏమి మాట్లాడలేదు....

జయరాం చదువు కోసం చెన్నై బయలు దేరి వెళ్ళాడు...  హాలిడేస్ లో ఇంటికి రావటం తండ్రికి పౌరోహిత్యం లో సహాయం చేస్తూ ఉండేవాడు జయరాం ...


ఆలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి ..

తెల్లవారితే దసరా పండుగ .. పండుగకి ఇంటికి వచ్చే కొడుకు కోసం .. పిండి వంటలు తయారు చేస్తున్నారు ఆ దంపతులు ... ఈలోపు బయట నుంచి పిలుపు .. పద్మనాభం గారు పద్మనాభం గారు .. అంటూ .

ఎవరు అంటూ చేతులను టవల్ తో తుడుచుకుంటూ .. బయటకు వెళ్ళాడు ...ఎదురుగా కాన్స్టేబుల్ రమేష్ ఉన్నాడు ...

పద్మనాభం గారు .. ఏంటి కాన్స్టేబులే గారు .. ఈ టైం లో ఇలా వచ్చారు ఏంటి ?

ఏదైనా ముహూర్తం చూడాలా ... ( రమేష్ కి పద్మనాభం గారి అంటే బాగా నమ్మకం ప్రతి పనికి తన దగ్గర ముహూర్తం రాపిస్తాడు )

లేదు అండీ..

మరి ఈ టైం లో ..ఈలోపు మహాలక్ష్మి గారు కూడా బయటకు వచ్చారు ...

మా ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని స్టేషన్ కి రమన్నారు ...

ఏంటి ...

అవును అండీ  మీరు అర్జెంటు గ స్టేషన్ కి రావాలి ...

ఏదైనా సీరియస్ ఆ ? అని ఇద్దరు భయం తో అడిగారు ... ఒకరిని ఒకరు చూసుకుంటూ ...
మీరు రండి చెప్తా అని పద్మనాభం గారిని తీసుకెళ్లాడు రమేష్ స్టేషన్ కి ...

స్టేషన్ లో కి అడుగు పెట్టగానే ...అప్పటికి వరకు గుడి మెట్లనే ఎక్కిన పద్మనాభం గారికి పోలీస్ స్టేషన్ మెట్లు కొత్తగానూ .. కొంచెం భయం గాను అనిపించాయి

సర్ రమ్మన్నారంట ...

ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉన్న .. ఫోటో చూపించి .. ఇది మీ అబ్బాయి దేనా అని అడిగారు...

పద్మనాభం గారు .. కంగారుగా ఫోటో ని తన చేతులోకి తీసుకొని .. దాని వైపు చూసాడు .... కాలేజీ లో తన తోటి ఫ్రెండ్స్ తో జయరాం దిగిన ఫోటో అది ...

ఏమి జరిగిందో తెలియదు ఏంజరుగుతోందో తెలియదు ... పద్మనాభం గారు అవును యిది మా అబ్బాయి ఫోటో నే అని కంఫర్మ్ చేసారు ...

చైర్ లో నుంచి లేచి ఇన్స్పెక్టర్ గారు .. పద్మనాభం గారూ .. ఐ అం వెరీ సారీ ..

మీ అబ్బాయి .. మీ అబ్బాయి .. ఇవాళ మార్నింగ్ చెన్నై లో ఆత్మహత్య చేసుకున్నాడు ...

పద్మనాభం గారు ఒక్కసారిగా ఉలిక్కి పది .. తన చేతులతో చెవులు మూసుకొని అమంగళం ప్రతిహతం అవునుగాక అన్నారు ...

మా అబ్బాయి పండగకి వస్తాడని వాళ్ళ ఆ  అమ్మ ఇంట్లో వాడి కోసం పిండి వంటలు చేస్తుంది సర్ ..
 మీకు ఎదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది అన్నాడు ...

ఇన్స్పెక్టర్ .. లేదు అండీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ .. మీ అబ్బాయి మెడిసిన్ చదవటం తన వాళ్ళ అవ్వటం లేదు .. తన మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టులేకపోతునందుకు క్షమించ మని అడుగుతూ లెటర్ రాసి .....
పద్మనాభం  గారు చాలు ఆపండి అన్నట్టు చేయి చూపించి .. సర్ వాడు ఇపుడు ఎక్కడ సర్ ..
బాడీ చెన్నై నుంచి వస్తుంది .. అన్నాడు ..

సర్ దయచేసి ఆలా అనకండి సర్ ..
జయరాం .. నా జయరాముడు వస్తున్నాడు అని చెప్పండి సర్ .. అని విలపించాడు

కొద్దిసేపటికి జయరాం వున్నా అంబులెన్సు వచ్చి ఆగింది .. ప్రయాణం చేసి అలసి పడుకున్నట్లు గ ఉన్నదే తప్పితే ...జయరాం చనిపోయినట్లు గ లేదు ..


అంబులెన్సు దగరికి వెళ్లి జయరాం తల మీద నిమురుతూ ..
నాన్న జయ ..లే నాన్న ...
ఇంటికి వెళ్దాం లే నాన్న ……మీ అమ్మ నీకు ఇష్టమైన పిండి వంటలు చేస్తుంది లే నాన్న అని రోదిస్తుంటే..
ఊరి జనం పద్మనాభం గారిని చూసి తల్లడిల్లి పోయారు...

ఇంటికి వెళ్లి తన భార్య కి  ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ... వచ్చే ఏడుపు ని అదుపు చేయలేక ... అలాగే అంబులెన్సు  ఇంటికి తీసుకు వెళ్లారు ..

పద్మనాభం గారు ఇంటికి వెళ్లే సరికే ఏ విషయం మహాలక్ష్మి గారికి తెలిసిపోయింది ..
కన్నా కొడుకు ఇక లేడు అన్న వార్త ...విన్న ఆవిడా చలనం లేకుండా పోయారు ...
అంబులెన్సు లో నుంచి కొడుకుని కిందకి దించగానే ..
బాబు జయ అంటూ ..  కొడుకుని పట్టు కొని కన్నీరు మున్నేరు అయింది ...

6 నెలల తరువాత ..

మహాలక్ష్మి గారు.. పెరట్లో తులసి చెట్టుకి నీళ్లు పోస్తున్నారు .. పద్మనాభం గారు తనని నమ్మిన రాముడి గుడి లో సేవలు చేస్తున్నారు ...

ఆలా వృద్ధ దంపతులు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు ..

ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ...

పెళ్లి అయన 10 సంవత్సరాలు కూడా  పిల్లలు లేక అందరితో మాటలు పడుతూ .. ఆఖరికి గొడ్రాలు గొడ్రాలు అని అందరు అంటున్న ... తనని నమ్ముకున్న రాముడు తనిఖీ అన్యాయం చేయడు అని జీవితం మీద నమ్మకం తో  జీవితాన్ని సాగించిన .. ఏ దంపతులు




ప్రపంచం లో ఏది ఆగిన ఆగనివి రెండు.. సూర్యోదయo .. సూర్యాస్తమయం అలారంతో పనిలేకుండా సూర్యుడు వచ్చేస్తాడు  ..
ఊరి మధ్యలో ఉన్న రామాలయం గుడి లో సుప్రబ్రతం వినిపిస్తుంది .. 
మహాలక్ష్మి గారు.. పెరట్లో తులసి చెట్టుకి నీళ్లు పోస్తున్నారు .
. పద్మనాభం గారు తనని నమ్మిన రాముడి గుడి లో సేవలు చేస్తున్నారు ...

ఆలా వృద్ధ దంపతులు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు ..

ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ...

జయరాం ? ; 2 ఇయర్స్ లో చదివే చదువు కష్టం అనిపించి ఆత్మహత్య చేసుకున్నాడు .. ఒక్క మాట నాన్న నాకు ఈ చదువు కష్టం అవుతుంది అంటే నాన్న వద్దంటాడా ... అమ్మ వారిస్తుందా ..?

ప్రపంచం మొత్తం మనల్ని కాదు అన్న .. మన పక్షాన నిలబడేది మన పేరెంట్స్ మాత్రమే ..

తమ పిల్లల భవిష్యతు మాకు ఎందుకు లే అని ఆ తల్లితండ్రులు అనుకోలేదు ..
 ఈ సంసారం భారం నాకు వద్దు అని ఏ తండ్రి ఆత్మహత్య చేసుకోలేదు ...

తల్లితండ్రుల్ని ప్రేమించండి ... వాళ్ళు ఏమి చేసిన మీకోసం మీకోసం మాత్రమే ...

తల్లితండ్రులను వద్దు అనుకున్న పిల్లలు ఉన్నారు గాని ...

పిల్లలని వద్దు అనుకున్న తల్లితండ్రులు లేరు .. ఉండరు ...
పద్మనాభం దంపతులు :
పెళ్లి అయన 10 సంవత్సరాలు కూడా  పిల్లలు లేక అందరితో మాటలు పడుతూ .. ఆఖరికి గొడ్రాలు గొడ్రాలు అని అందరు అంటున్న ... తనని నమ్ముకున్న రాముడు  అన్యాయం చేయడు అని జీవితం మీద నమ్మకం తో  జీవితాన్ని సాగించించారు  ..

జయరాం తన పాటికి తాను .. అమ్మ నాన్న క్షమించండి .. అని ఒక్క ఉత్తరం తో ...సమాధనం చెప్పి వెళ్ళిపోతే ... ఈ వయసులో .. వారికీ ఎవరు తోడు .? వాళ్ళ ఎవరికోసం బ్రతకాలి ?

10 ఇయర్స్ తరువాత పుట్టి వాళ్ళ సర్వస్వము  తానే అనుకున్న కొడుకు తమకంటే ముందే వెళ్ళిపోతే ..
వాళ్ళు వెళ్లిపోవాలా ?
వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ?

చేతకాదు ..చనిపోతాను .. చనిపోవాలి .. ఇలాంటి ఆలోచనలకూ చెప్పండి 

ఇక సెలవు అని ..


మీ 
కళాశంకర్.


x